Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్....

Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!

Vijay Devarakonda Goes Extreme Bold For Liger

Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, లైగర్‌పై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండను నెవర్ బిఫోర్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడు పూరీ. అయితే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరీ అని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సినిమా అంటే అభిమానులు ఖచ్చితంగా బోల్డ్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే ఈసారి ఆ విషయంలో మనోడు డోస్ మరింత పెంచేశాడు.

Liger: నువ్వు పుట్టిందే గెలిచేటందుకు.. లైగర్ హంట్ బిగిన్స్!

తాజాగా లైగర్ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. గతంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమాలో ఓ రేడియో మాత్రమే అడ్డుపెట్టుకుని బట్టలు లేకుండా ఓ పోస్టర్‌తో రచ్చ చేశాడు. ఇప్పుడు అదే బాటలో లైగర్ కూడా వెళ్తున్నాడు. ఓ పూల బొకేను మాత్రమే అడ్డుపెట్టుకుని ఎలాంటి బట్టలు వేసుకోకుండా ఓ ఫోటోను వదిలాడు ఈ రౌడీ స్టార్. ఈ సినిమా కోసం తాను మెంటల్‌గా, ఫిజికల్‌గా తన పర్ఫార్మెన్స్ కోసం అన్నీ ఇచ్చేశానంటూ ఈ ఫోటోతో చెప్పుకొచ్చాడు.

Liger: లైగర్ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సాలిడ్ ఢీల్..?

అయితే లైగర్ సినిమా తన నుండి తీసుకున్న వాటన్నింటినీ తన అభిమానులకు ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ద్వారా తిరిగిచ్చేస్తానంటూ ధీమా హామీ ఇస్తున్నాడు ఈ హీరో. ఇక విజయ్ దేవరకొండ ఇంత బోల్డ్‌గా మారడంతో ఈ సినిమాలో ఇంకా ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, లైగర్ సినిమాలో లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఆగస్టు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.