Unstoppable with NBK : ‘లైగర్’తో అన్ స్టాపబుల్ అంటున్న బాలయ్య

ప్రస్తుతం రానాతో చేసిన ఎనిమిదవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తొమ్మిదవ ఎపిసోడ్ కి ఎవరు గెస్ట్ గా వస్తారో అని అందరు ఎదురు చూస్తున్నారు. తాజాగా తొమ్మిదో ఎపిసోడ్ కి సంబంధించిన......

Unstoppable with NBK : ‘లైగర్’తో అన్ స్టాపబుల్ అంటున్న బాలయ్య

Balakrishna

Unstoppable with NBK :  బాలకృష్ణ యాంకర్ గా మొదలు పెట్టిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. సినీ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళ లైఫ్ లోని చాలా మూమెంట్స్ ని ప్రేక్షకులకి తెలియచేస్తున్నారు. ఈ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ప్రోగ్రాంకి భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులే కాక ప్రేక్షకులంతా బాలయ్యని ఈ షో హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు.

ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ 10వ ఎపిసోడ్ లో మహేష్ బాబు కూడా రానున్నారు. ప్రస్తుతం రానాతో చేసిన ఎనిమిదవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తొమ్మిదవ ఎపిసోడ్ కి ఎవరు గెస్ట్ గా వస్తారో అని అందరు ఎదురు చూస్తున్నారు. తాజాగా తొమ్మిదో ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది.

Naga Shaurya : ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేస్తున్న నాగశౌర్య

ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ తొమ్మిదో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ రానుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ పండగ ఎపిసోడ్ కావడంతో బాలయ్య పంచ కట్టుకొచ్చారు. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు లీక్ అవ్వడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు విజయ్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో లైగర్ తో కలిసి అఖండ రచ్చ చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుందని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు