Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??

విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్ర బృందం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా...........

Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??

Khishi

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ, సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని చాలా వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కశ్మీర్ నుంచి సమంత, విజయ్ దేవరకొండ షూటింగ్ స్టిల్స్ ని షేర్ చేశారు. వాళ్ళ ఇద్దరి పుట్టినరోజులు కూడా ఇదే షూట్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్ర బృందం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ‘ఖుషి’ టైటిల్ ని వాడేశారు. విజయ్ దేవరకొండ, సమంత సినిమాకి ‘ఖుషి’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 22న సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేయడం విశేషం.

Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్

అయితే ఈ సినిమాపై విజయ్, సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అలాంటి మంచి క్లాసిక్ టైటిల్ ని విజయ్ లాంటి మాస్ హీరో వాడకపోవడమే మంచిది అంటున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్, అందులో విజయ్, సమంత లుక్స్ చూస్తుంటే ఇది కూడా లవ్ రొమాంటిక్ డ్రామాలా ఉండబోతుందని తెలుస్తుంది. విజయ్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకొని పెద్ద రిస్క్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి. కొంచెం అటు ఇటు అయినా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఆడుకుంటారో తెలిసిందే.