Vijay Devarakonda: థియేటర్ యజమాని ఆశీర్వాదం తీసుకుని వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఇటీవల రిలీజ్ అయ్యి థియేటర్లలో రచ్చ చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహించారు లైగర్ టీమ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ కొందరిలో నెగెటివిటీని క్రియేట్ చేశాయి. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వారికి నచ్చలేదు. దీంతో కొందరు విజయ్‌ను తీవ్రంగా విమర్శించారు.

Vijay Devarakonda: థియేటర్ యజమాని ఆశీర్వాదం తీసుకుని వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Seeks Blessings Of Maratha Mandir Owner Manoj Desai

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఇటీవల రిలీజ్ అయ్యి థియేటర్లలో రచ్చ చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహించారు లైగర్ టీమ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ కొందరిలో నెగెటివిటీని క్రియేట్ చేశాయి. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వారికి నచ్చలేదు. దీంతో కొందరు విజయ్‌ను తీవ్రంగా విమర్శించారు.

Vijay Devarakonda: భారత్-పాక్ మ్యాచ్‌లో ‘లైగర్’ సందడి.. ప్రేక్షకులతో కలిసి మ్యాచ్ వీక్షించిన విజయ్ దేవరకొండ

వారిలో ముంబైలోని మరాఠా మందిర్, గేలాక్సీ థియేటర్స్ ఓనర్ మనోజ్ దేశాయి కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి కామెంట్స్ చేశాడని.. తన సినిమా నచ్చితే చూడమని లేకపోతే లేదని చెప్పడంతో తమ థియేటర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌లో తీవ్ర ప్రభావం చూపిందంటూ మనోజ్ దేశాయి మండిపడ్డారు. ఈ వీడియో గురించి తెలుసుకుని విజయ్ దేవరకొండ నిన్న మనోజ్ దేశాయిని స్వయంగా కలిశాడు.

Vijay Devarakonda : మేం సినిమాలు చేయొద్దా.. ఇంట్లో కూర్చోవాలా..? బాయ్‌కాట్‌ లైగర్ పై స్పందించిన విజయ్ దేవరకొండ..

తాను థియేటర్లకు ఆడియెన్స్ రావద్దని చెప్పలేదని.. తన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని మనోజ్ దేశాయికి వివరించారు. ఈ క్రమంలో మనోజ్ దేశాయి కూడా విజయ్ చేసిన కామెంట్స్‌ను తాను పూర్తిగా అర్థం చేసుకోలేదని.. ఓటీటీలపై తనకున్న కోపం కారణంగా విజయ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆయన అన్నారు. ఇక లైగర్ సినిమాకు ప్రస్తుతం మంచి రెస్పాన్స్ దక్కుతుందని, మున్ముందు విజయ్ చాలా హైట్స్‌కు వెళ్తాడని మనోజ్ దేశాయి ఈ సందర్భంగా అన్నారు. ఇక మనోజ్ దేశాయి కాళ్లు మొక్కి విజయ్ తనను ఆశీర్వదించాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.