Vijay Devarakonda : బట్టలు విప్పేస్తున్న వీడియో షేర్ చేసిన అర్జున్ రెడ్డి

హాలీవుడ్ 'venom' సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఓ వీడియో చేశాడు విజయ్. ఈ వీడియోలో బట్టలు అన్ని విప్పేస్తూ 'venom' సినిమా సూపర్ హీరోగా మారిపోయినట్టు ప్రమోట్ చేసాడు. 

Vijay Devarakonda :  బట్టలు విప్పేస్తున్న వీడియో షేర్ చేసిన అర్జున్ రెడ్డి

Vijay

Vijay Devarakonda :  టాలీవుడ్ లో హీరోకి కొత్త నిర్వచనం ఇచ్చి రౌడీ అనే పదానికి పాజిటివ్ ఇమేజ్ ఇచ్చి స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు. తన సినిమా ఫ్లాప్ అయినా కూడా విజయ్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్ లతో కూడా బిజీ అయిపోయాడు. ఓ వైపు రౌడీ వేర్ బ్రాండ్ తో బట్టల బిజినెస్ చేస్తూ ఇటీవలే మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ చేసాడు. ఇక యాడ్స్ అయితే చెప్పనవసరం లేదు. తాజాగా హాలీవుడ్ ‘venom’ సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఓ వీడియో చేశాడు విజయ్. ఈ వీడియోలో బట్టలు అన్ని విప్పేస్తూ ‘venom’ సినిమా సూపర్ హీరోగా మారిపోయినట్టు ప్రమోట్ చేసాడు.

Aryan Khan : అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ లావాదేవీలు.. ఆర్యన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడా?

విజయ్ దేవరకొండ తన రౌడీ వేర్ బ్రాండ్‌ను, ‘venom’ సినిమాని ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో తన బట్టలన్నీ కూడా విప్పేశాడు. చివరకు హాలీవుడ్ సూపర్ హీరోలా మారిపోయాడు. కొత్త లుక్కులోకి మారవా? కొత్తగా ట్రై చేయవా? అని అడిగాడు. అర్జున్ రెడ్డి ఇలా బట్టలు విప్పేస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.