ప్రభాస్ అన్న అలాంటి సినిమాలు చేస్తే కిరాక్ ఉంటది!

ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా సినీ ప్రేక్షకులను అలరించనున్న ‘టెర్మినేటర్ : డార్క్‌ఫేట్’ తెలుగు ట్రైలర్ విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదలైంది..

  • Published By: sekhar ,Published On : October 16, 2019 / 09:46 AM IST
ప్రభాస్ అన్న అలాంటి సినిమాలు చేస్తే కిరాక్ ఉంటది!

ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా సినీ ప్రేక్షకులను అలరించనున్న ‘టెర్మినేటర్ : డార్క్‌ఫేట్’ తెలుగు ట్రైలర్ విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదలైంది..

హాలీవుడ్ యాక్షన్ సినిమాలలో టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్ : డార్క్‌ఫేట్’ రానుంది. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా సినీ ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేయగా, ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మించిన ‘టెర్మినేటర్ : డార్క్‌ఫేట్’ తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

‘ప్ర‌భాస్ అన్న ‘ట‌ెర్మినేట‌ర్‌’ లాంటి సినిమాలు చేయాలి. తెలుగులోకి హాలీవుడ్ సినిమాల‌ను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మ‌న ‘సాహో’, ‘సైరా’, ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ వంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. 

Read Also : ‘రూలర్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమిని

‘టెర్మినేటర్’, ‘టెర్మినేటర్ 2 : జడ్జిమెంట్ డే’ సినిమాలకు డైరెక్ట్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. నటాలియా రేయెస్, డియెగో బోనెటా తదితరులు నటించిన ‘టెర్మినేటర్ : డార్క్ ఫేట్’.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.