ఈ పాట విని అమ్మ ఏడ్చింది

డియర్ కామ్రేడ్ నుండి సెకండ్ సింగిల్‌ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. ఈ సూతింగ్ మెలోడి విని తన తల్లి కంటతడి పెట్టుకుందని విజయ్ చెప్పాడు..

  • Published By: sekhar ,Published On : May 15, 2019 / 07:32 AM IST
ఈ పాట విని అమ్మ ఏడ్చింది

డియర్ కామ్రేడ్ నుండి సెకండ్ సింగిల్‌ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. ఈ సూతింగ్ మెలోడి విని తన తల్లి కంటతడి పెట్టుకుందని విజయ్ చెప్పాడు..

సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, భరత్ కమ్మా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై.. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై.రవిశంకర్, యష్ రంగినేని నిర్మిస్తున్న సినిమా.. డియర్ కామ్రేడ్.  ఇంతకుముందు రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ టీజర్, అండ్ ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ నుండి సెకండ్ సింగిల్‌ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు.

ఈ సూతింగ్ మెలోడి విని తన తల్లి కంటతడి పెట్టుకుందని విజయ్ చెప్పాడు. ‘ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే భరత్ నుండి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే అది ఆడియో ఫైల్.. సాంగ్ ప్లే చేసి వింటూ, చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత ఇంట్లో ఎప్పుడు ఈ పాట ప్లే చేసినా అమ్మ కళ్ళు చెమర్చడం చాలా సార్లు చూసాను. ఇప్పుడు ఈ పాట మీకోసం, వినండి’.. అని ట్వీటాడు విజయ్ దేవరకొండ. అతణ్ణి అంతలా ఎమోషనల్ అయ్యేలా చేసిన సాంగ్ మీరూ వినెయ్యండి మరి.