Leo Movie : లియో పాన్ ఇండియా వద్దు.. నేను సినిమాలు తీసేది మన ప్రేక్షకుల కోసం మాత్రమే.. విజయ్ వ్యాఖ్యలు

లియో సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని చిత్రయూనిట్ గతంలో ప్రకటించారు. కానీ మొదట విజయ్ పాన్ ఇండియా వద్దన్నారట. తాజాగా ఈ విషయంలో విజయ్ తో జరిగిన సంభాషణని నిర్మాత లలిత్ కుమార్ బయటపెట్టారు.

Leo Movie : లియో పాన్ ఇండియా వద్దు.. నేను సినిమాలు తీసేది మన ప్రేక్షకుల కోసం మాత్రమే.. విజయ్ వ్యాఖ్యలు

Vijay don't want to Leo be a pan Indian movie

Leo Movie :  తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవ(Vijay)ల సంక్రాంతికి(Sankranthi) తమిళ్ లో వరిసు, తెలుగులో వారసుడు(Varasudu) సినిమాతో వచ్చి తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో(Leo) సినిమా చేస్తున్నాడు. గతంలో లోకేష్ తో మాస్టర్ సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండో సినిమా కావడం, ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవ్వడంతో లియో పై అభిమానులు, ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం లియో సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. ఇందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంజిత్ దత్, గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని చిత్రయూనిట్ గతంలో ప్రకటించారు. కానీ మొదట విజయ్ పాన్ ఇండియా వద్దన్నారట. తాజాగా ఈ విషయంలో విజయ్ తో జరిగిన సంభాషణని నిర్మాత లలిత్ కుమార్ బయటపెట్టారు.

Tirupur Subramaniam : బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్నీ అబద్దాలే.. ఫ్లాప్ అయితే నిజం చెప్పండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్..

చెన్నైలో ప్రస్తుతం CII దక్షిణ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సౌత్ నుంచి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అనేక అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చలు జరిగాయి. తాజాగా గురువారం నాడు లియో ప్రొడ్యూసర్, సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్ కుమార్ పాల్గొన్నారు. లలిత్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేము మొదట లియో సినిమాని పాన్ ఇండియా ప్లాన్ చెయ్యలేదు. కానీ లోకేష్ తీసిన విక్రమ్ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇదే విషయాన్ని విజయ్ కి చెప్పాము. కానీ విజయ్.. అవన్నీ ఏం వద్దు. నేను మన ప్రేక్షకుల కోసమే సినిమాలు తీస్తున్నాను అని అన్నారు. కానీ నేను, లోకేష్ కలిసి విజయ్ తో చాలా సేపు మాట్లాడి ఒప్పించాము. ఆ తర్వాత పాన్ ఇండియాకు తగ్గట్టు లియో స్క్రిప్ట్ ని మార్చాము అని అన్నారు.