Vijay Father : ‘బీస్ట్’ సినిమాలో స్క్రీన్‌ప్లే అస్సలు బాలేదు

తాజాగా బీస్ట్ సినిమాపై హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ''అరబిక్‌ కుతు సాంగ్‌ను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్‌ చేశారో నేను కూడా అలాగే ఎంజాయ్‌ చేశాను.....

Vijay Father : ‘బీస్ట్’ సినిమాలో స్క్రీన్‌ప్లే అస్సలు బాలేదు

Beast

 

Vijay Father :  తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అదే టైంకి ‘కేజిఎఫ్ 2’ సినిమా కూడా రిలీజ్ అయింది. అంతా అనుకున్నట్టే ‘బీస్ట్’ని దేశమంతటా ‘కేజిఎఫ్ 2’ డామినేట్ చేసింది. ఇక బీస్ట్ సినిమా రిలీజ్ రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో స్టార్ హీరో కావడంతో మొదటి రోజు మాత్రం కలెక్షన్స్ వచ్చాయి. విజయ్ అభిమానులు కూడా ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డైరెక్టర్ నెల్సన్ వరుస హిట్స్ తో ఉండటంతో బీస్ట్ సినిమాపై కూడా విజయ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ వరకు కలెక్షన్లని రాబట్టినా ప్లాప్, యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది.

 

Radhika Sarath Kumar : మా నాన్నకి, ఎంజీఆర్‌కి మధ్య గొడవలని వెబ్‌సిరీస్‌లా తీస్తాను

తాజాగా బీస్ట్ సినిమాపై హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ”అరబిక్‌ కుతు సాంగ్‌ను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్‌ చేశారో నేను కూడా అలాగే ఎంజాయ్‌ చేశాను. కానీ బీస్ట్‌ సినిమా కేవలం విజయ్‌ స్టార్‌డమ్‌ మీదే నడిచినట్లు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదులకు సంబంధించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించలేదు. సినిమాలో స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. సినిమా దర్శకుడు మిలటరీ దళాలు, రా ఏజెంట్స్‌ ఏం చేస్తారు? వారు ఎలా ఉంటారు? అని లోతుగా తెలుసుకుని, మరింత పరిశోధించి సినిమాను తెరకెక్కించాల్సింది. బీస్ట్‌ సినిమా సక్సెస్‌పై అనుమానించాల్సిన అవసరమే లేదు. సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్‌, ఫైట్‌ మాస్టర్‌, ఎడిటర్‌, హీరో వీళ్ల వల్లే బీస్ట్‌ సక్సెస్‌ అయింది” అని తెలిపాడు. కానీ విజయానికి కారణమైనవారి జాబితాలో డైరెక్టర్‌ నెల్సన్‌ పేరును ప్రస్తావించకపోవడం విశేషం.