Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు? Vijay Khushi with Samantha.. Why are you limiting to the South?

Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. లైగర్ సినిమాతో రెండు సంవత్సరాలు బిజీగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు పూరీతో జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి, ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే గ్యాప్ లో..

Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?

Kushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. లైగర్ సినిమాతో రెండు సంవత్సరాలు బిజీగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు పూరీతో జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి, ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే గ్యాప్ లోనే, శివనిర్వాణతో మరో సినిమా పట్టాలెక్కించేశాడు. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీ టైటిల్ నే ఖరారు చేశారు.

Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??

టైటిల్ అనౌన్స్ మెంట్ రోజే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.. అంతే కాదు, సినిమా రిలీజీ్ డేట్ కూడా డిసెంబర్ 23గా ఫిక్స్ చేశారు.. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా ఖుషి.. ఆ టైటిల్ ను అడాప్ట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ రేంజ్ క్రేజ్ ను తెచ్చుకుంటాడా అని అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు, రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. ఇక లైగర్ పాన్ ఇండియా మూవీతో పవర్ ఫుల్ యాక్షన్ చేసిన తర్వాత ఖుషితో క్రేజీ హీరోయిన్ సమంతతో రొమాంటిక్ లవ్ చేస్తున్నాడు. ఇలా కంప్లీట్ వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ లో క్రేజ్ పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..

పఠాన్ స్టైల్ కాస్ట్యూమ్స్ తో విజయ్, సంప్రదాయ శారీ కట్టులో సమంత.. ఇద్దరికీ పెళ్లి ముడి, మధ్యలో క్యాశ్మీర్ మ్యాప్, రెండు శాంతి కపోతాలు.. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమాపైన స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు శివ నిర్వాణ. రొమాంటిక్ లవ్ యూనివర్శల్ సబ్జెక్టే కాని, ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళి లాంగ్వేజ్ లోనే ఖుషీ చేస్తున్నారు ఎందుకని ఆడియన్స్ లో చర్చ మొదలైంది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా క్రేజ్ వస్తుందనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.. అలాంటిది మరి ఖుషిని హిందీలో ఎందుకు రిలీజ్ చేయడంలేదనే డౌట్ రేజ్ చేస్తున్నారు.

Vijay Devarakonda: సమంతను టీజ్ చేస్తున్న విజయ్.. మామూలుగా లేదుగా!

టక్ జగదీష్ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణతో మణిరత్నం ఆల్ టైమ్ సూపర్ హిట్ రోజా కైండ్ ఆఫ్ జానర్ మూవీ చేస్తున్నారు క్రేజీ హీరో. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ క్యాశ్మీర్లో జరుగుతుంది.. కశ్మీర్ తర్వాత హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శివ నిర్వాణకు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ వస్తుందా? విజయ్ దేవరకొండకు ఈసినిమా ఎలాంటి క్రేజ్ ను తీసుకొస్తుందో తెలియాలంటే డిసెంబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.

×