Leo Movie: ‘లియో’ నెల రోజులు బిజీ.. కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..?
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను చెన్నైలో ఏకంగా నెలరోజులపాటు జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Vijay Leo Movie Next Schedule To Last For One Month
Leo Movie: తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘వారిసు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు లియో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను మే 1 నుండి స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ నెలరోజుల పాటు సాగనుందని.. ఈ షెడ్యూల్‌లో విజయ్, హీరోయిన్ త్రిష, సంజయ్ దత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్ చెన్నైలో జరగనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Leo Movie: విజయ్ ‘లియో’ మూవీ అప్డేట్.. కశ్మీర్ టు చెన్నై..!
ఇక ఈ సినిమాలో ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.