Leo Movie: విజయ్ ‘లియో’ మూవీ అప్డేట్.. కశ్మీర్ టు చెన్నై..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 29న ప్రారంభమయ్యే ఈ కొత్త షెడ్యూల్ ఏకంగా 17 రోజుల పాటు జరగనుంది.

Vijay Leo Movie Next Schedule Update
Leo Movie: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు ‘లియో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, కాశ్మీర్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ఇటీవల ముగించింది చిత్ర యూనిట్.
Leo Movie: విజయ్ లియో మూవీ కోసం స్పీడందుకున్న లోకేశ్ కనగరాజ్!
ఇక ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం లోకేశ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 29న ప్రారంభమయ్యే ఈ కొత్త షెడ్యూల్ ఏకంగా 17 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అటుపై లియో మూవీ యూనిట్ హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ షూట్ చేయనున్నారు.
Leo Movie: విజయ్ ‘లియో’ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయిన లోకేశ్..?
ఈ సినిమాలో విజయ్ పాత్రను అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట లోకేశ్. ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే బోలెడన్ని సర్‌ప్రైజింగ్ అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.