Vijay : దసరాకే లియో.. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఇయర్ లో రెండు సినిమాలు..

విజయ్ 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ మాసివ్ ప్రోమో రిలీజ్ చేసి లియో అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తమిళ యువ దర్శకుడు, వరుస హిట్స్ తో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. లియో సినిమాలో...............

Vijay : దసరాకే లియో.. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఇయర్ లో రెండు సినిమాలు..

Vijay Leo movie will release on dasara 2023

Vijay :  తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చి విజయం సాధించాడు. తెలుగులో ఈ సినిమా అంతగా ఆడకపోయినా తమిళ్ లో మంచి విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన 20 రోజుల్లోపే మరో సినిమాని, టైటిల్ ని అనౌన్స్ చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు విజయ్. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య స్టార్ హీరోస్ అంతా సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో సినిమా తీస్తున్నారు. ఇప్పుడు విజయ్ సినిమా రిలీజ్ అయి నెల కూడా కాకముందే నెక్స్ట్ సినిమా షూట్ మొదలుపెట్టడంతో చాలా ఫాస్ట్ అయ్యాడు అంటున్నారు.

విజయ్ 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ మాసివ్ ప్రోమో రిలీజ్ చేసి లియో అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాని తమిళ యువ దర్శకుడు, వరుస హిట్స్ తో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. లియో సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుండగా ప్రియా ఆనంద్, సంజయ్ దత్.. మరికొంతమంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ లియో ప్రోమో చూసిన తర్వాత ఇది కూడా లోకేష్ మార్క్ వయోలెన్స్, మాస్ సినిమాలాగే అనిపిస్తుంది.

లోకేష్ విజయ్ కాంబినేషన్ తో గతంలో మాస్టర్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. ఇక లోకేష్ కూడా వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉండి LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించి ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్ పెడుతూ ప్రేక్షకుల్లో తన సినిమాలపై ఆసక్తిని పెంచాడు. దీంతో ఈ లియో సినిమా కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక లియో సినిమాని దసరా కానుకగా 2023 అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్టు అప్పుడే ప్రకటించేశారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. లోకేష్ చాలా ఫాస్ట్ గా వర్క్స్ జరిపిస్తున్నాడు.

K Viswanath : బాలీవుడ్‌లో విశ్వనాథ్ సినీ ప్రయాణం..

దీంతో విజయ్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేసినట్టు అవుతుంది. సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చాడు. దసరాకి లియో సినిమాతో రాబోతున్నాడు. విజయ్ స్టార్ హీరోగా మారాక దాదాపు సంవత్సరానికి ఒక సినిమానే తెస్తున్నాడు. 2017 లో విజయ్ సంక్రాంతికి భైరవ, దీపావళికి మెర్సల్ సినిమాలతో వచ్చాడు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు 2023 లో రెండు సినిమాలతో రాబోతున్నాడు.