ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..

ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..

Vijay Sethupathi: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. సర్ సర్ ప్లీజ్ సర్.. ఒక్క ఛాన్స్ ఇప్పించండి సర్.. అంటూ సినిమా ఛాన్సుల కోసం అడుగుతున్నారు విలక్షణ నటుడు, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి. అదేంటి..? చేతినిండా సినిమాలతో, అసలు ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే టైమ్ లేక, కొత్త సినిమాల్ని ఒప్పుకోవడానికి డేట్స్ లేక కిందా మీదా పడుతున్న విజయ్ సేతుపతి ఒక్క ఛాన్స్ ఇమ్మని అడగడం ఏంటి.. అనుకుంటున్నారా?..

Vijay Sethupathi

విజయ్ సేతుపతి.. హీరోగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ నటుడిగా మారిపోయారు. అందుకే వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. అయితే వస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో మిస్ అవుతున్నారు విజయ్. అలా మిస్ అయిన డైరెక్టర్స్‌తో, యాక్టర్స్ తో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఓపెన్‌గానే అడుగుతున్నారు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi

విజయ్ సేతుపతికి సౌత్‌లో స్పెషల్లీ తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పట్టుబట్టి మరీ ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా చేయించారు. ఆ రషెస్ చూసి సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో కూడా విజయ్ సేతుపతినే విలన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూతో ‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. అయితే విజయ్ మాత్రం ఈ మిస్ అయిన ఛాన్స్‌ని మళ్లీ గ్రాబ్ చేస్కోడానికి సుకుమార్ సర్.. ప్లీజ్ నాకు మీ సినిమాలో ఒక్క ఛాన్సివ్వండి అంటూ పబ్లిక్‌గానే అడిగారు.

Vijay Sethupathi సౌత్ సీనియర్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ లో ఛాన్స్ కూడామిస్ అయ్యారువిజయ్ సేతుపతి. ‘భారతీయుడు 2’ లో నటించే అవకాశం వచ్చింది, కానీ రకరకాల కారణాలతో, ఆల్రెడీ ఉన్నకమిట్‌మెంట్స్‌తో సినిమాలో చెయ్యలేకపోయాను. మరోసారి నాకు అవకాశం ఇవ్వండి కమల్ సర్ అంటూ కమల్ హాసన్‌తో నటించాలన్న తన కోరికను ఓపెన్‌గా చెప్పారు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi