మురళీధరన్ బయోపిక్: విమర్శలే గెలిచాయి.. విజయ్ తప్పుకున్నాడు..

  • Published By: sekhar ,Published On : October 19, 2020 / 07:16 PM IST
మురళీధరన్ బయోపిక్: విమర్శలే గెలిచాయి.. విజయ్ తప్పుకున్నాడు..

Muralitharan Biopic 800: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా.. ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న ‘800’ సినిమాపై తమిళ సంఘాలు, సినీ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో #ShameOnVijaySethupathi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. తన జీవిత కథను సినిమాగా తీస్తుంటే పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో
మురళీధరన్‌ తన బయోపిక్‌ నుండి వైదొలగాలంటూ విజయ్‌ సేతుపతికి రిక్వెస్ట్ చేయడంతో ఆయన ధన్యవాదాలు చెబుతూ తన నిర్ణయాన్ని తెలిపారు.


మురళీధరన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. “Thank you and goodbye” అంటూ ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు విజయ్ సేతుపతి.

‘‘నా బయోపిక్‌ ‘800’ మూవీ ప్రకటించిన తర్వాత కొందరు కొన్ని విమర్శలు చేశారు. కొందరి వ్యక్తులకు నా మీదున్న తప్పైన అవగాహనతో ‘800’ సినిమా నుండి వైదొలగమని నటుడు విజయ్‌ సేతుపతికి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నా కారణంగా తమిళనాడులోని ఓ మంచి నటుడు బాధపడకూడదని.. భవిష్యత్తులో విజయ్‌ సేతుపతికి కెరీర్‌ పరంగా ఎలాంటి సమస్యలు రాకూడదని, ఆయణ్న ఈ సినిమా నుండి వైదొలగమని కోరుతున్నాను.


ఒక్కోసారి నాకు ఏర్పడే అడ్డంకులను చూసి నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే నేనీ స్థాయిలో ఉన్నాను. నా బయోపిక్‌ యువతకు, యువ క్రికెటర్లలో స్ఫూర్తి నిస్తుందనే భావించి బయోపిక్‌ తీయడానికి అంగీకరించాను. దానికి ఇప్పుడు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను దాటి నా సినిమాను వారి దగ్గరకు చేరుస్తానని నమ్ముతున్నాను. నిర్మాణ సంస్థ చేసే ప్రయత్నాలకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్.