వరుస అవకాశాలు వస్తున్నా.. ‘సారీ బాస్’ అంటున్న విజయ్ సేతుపతి..

వరుస అవకాశాలు వస్తున్నా.. ‘సారీ బాస్’ అంటున్న విజయ్ సేతుపతి..

Vijay Sethupathi:  హీరోగా వర్కవుట్ కాదని తెలిసి అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నాడు తమిళ స్టార్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. వరుస పెట్టి వస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకోకుండా ‘సారీ బాస్’ అంటూ తప్పుకుంటున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాలతో సహా.. మరో రెండు సినిమాల ఛాన్స్‌లు పోగొట్టుకున్నాడు..

హీరోగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయ్యారు. అందుకే వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. అయితే వస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో మిస్ అవుతున్నారు విజయ్ ఆయన ఇప్పటికే 4 పెద్ద ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్నారు. స్టైలిష్ స్టార్ ‘పుష్ప’ లో ఫస్ట్ విజయ్ సేతుపతినే విలన్‌గా అనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్‌తో పాటు డేట్స్ ఇష్యూతో ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

సౌత్ సీనియర్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ లో ఛాన్స్ కూడామిస్ అయ్యారు విజయ్ సేతుపతి. ‘‘ఇండియన్ 2’ లో నటించే అవకాశం వచ్చింది, కానీ రకరకాల కారణాలతో, ఆల్రెడీ ఉన్నకమిట్‌మెంట్స్‌తో సినిమాలో చెయ్యలేకపోయాను. మరోసారి నాకు అవకాశం ఇవ్వండి కమల్ సర్’’.. అంటూ తన కోరికను ఓపెన్‌గా చెప్పారు విజయ్. అలా కమల్ హాసన్ సినిమా కూడా విజయ్ మిస్ అవ్వాల్సొచ్చింది.

శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా తియ్యాలనుకున్న సినిమా ‘800’. ఈ సినిమాలో మురళీ పాత్రని విజయ్ సేతుపతి చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోతకు సంబంధించి ఎప్పుడూ నోరువిప్పని మురళీధరన్ బయోపిక్‌లో నటిస్తే తమిళ జాతికి అన్యాయం చేసినట్టేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్, ట్రోలింగ్ ఎదుర్కొన్నారు విజయ్. అంతేకాదు.. మురళీధరన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడమే మంచిదని విజయ్‌కు సలహా ఇవ్వడంతో ‘800’ సినిమా నుంచి విత్ డ్రా అయ్యారు విజయ్.

సౌత్ సినిమాలేకాదు.. బాలీవుడ్ నుంచి వచ్చిన బంపర్ ఆఫర్ కూడా వదులుకున్నారు విజయ్ సేతుపతి. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్‌‌లో చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ లో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం విజయ్ సేతుపతిని సజెస్ట్ చేశారు ఆమిర్. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం వెయిట్‌ పెరాగాల్సి ఉంది. లావు పెరిగితే.. మళ్లీ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చెయ్యడం కష్టం.. అందుకే ఆమిర్ ఖాన్ సినిమా కూడా మిస్ అవ్వాల్సి వచ్చింది విజయ్ సేతుపతికి. అయితే విజయ్ ఇప్పటికే తెలుగులో ‘ఉప్పెన’ సినిమాతో పాటు, సమంత-నయనతారతో కలిసి నటిస్తున్న ‘కాతు వాకులా రెండు కాదల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి.