Vijay Sethupathi : విజయ్ సేతుపతి అంకిత భావం.. క్యాలెండర్ పై ఫోటోల కోసం మేకప్‌కి 45 నిమిషాలు..
తాజాగా విజయ్ సేతుపతి వీధి బాగోతం కళాకారుడిగా గెటప్ వేశారు. తమిళనాడులో ఉన్న ప్రాచీన కళల్లో వీధి బాగోతం ఒకటి. దీనిని అక్కడ 'తెరు కూత్తు' అని పిలుస్తారు. అయితే విజయ్ ఈ గెటప్........

Vijay Sethupathi (1)
Vijay Sethupathi : తమిళ్ హీరో విజయ్ సేతుపతి హీరోగానే కాక నటనకి ప్రాధాన్యమున్న ఎలాంటి పాత్ర అయినా చేస్తారు. విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదింస్తూ అభిమానులని పెంచుకుంటున్నారు. తాజాగా విజయ్ సేతుపతి వీధి బాగోతం కళాకారుడిగా గెటప్ వేశారు. తమిళనాడులో ఉన్న ప్రాచీన కళల్లో వీధి బాగోతం ఒకటి. దీనిని అక్కడ ‘తెరు కూత్తు’ అని పిలుస్తారు. అయితే విజయ్ ఈ గెటప్ వేసింది సినిమాకి కాదు ఒక క్యాలెండర్ కోసం.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తమిళనాడు ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎల్.రామచంద్రన్ ఈ సంవత్సరం ఓ సరికొత్త నూతన క్యాలెండర్ ని రూపొందించాలి అనుకున్నాడు. ఇందుకు వీధి భాగోతం కళని ఎంచుకున్నాడు. అయితే ఇందులో ఫొటోలకి విజయ్ సేతుపతిని అడగగానే ఒప్పుకున్నాడు. నిన్న సాయంత్రం ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ని విడుదల చేశారు.
Shannu Deepu : షణ్ముఖ్‌కి బ్రేకప్.. సోషల్ మీడియాలో దీప్తి సునైనా పోస్ట్.. షాక్‌లో అభిమానులు
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ”ఈ కళను నేర్చుకోవాలని ఎప్పట్నుంచో అనుకున్నాను కానీ కుదర్లేదు. తాజాగా ఈ క్యాలెండర్ పై ఫోటోల వల్ల కనీసం దీని గురించి తెలుసుకున్నాను. వీధి బాగోతం కళాకారుడిగా మారడానికి మేకప్‌కే 45 నిమిషాలకు పైగా పట్టింది” అని తెలిపారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి వీధి భాగోతం కళాకారుడిగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.