Vijay Son : తమిళ స్టార్ హీరో తనయుడు డైరెక్టర్ అవుతాడట.. మొదట డైరెక్ట్ చేసేది ఎవర్నో తెలుసా??

ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా డైరెక్టర్ అవ్వబోతున్నట్టు, త్వరలోనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు............

Vijay Son : తమిళ స్టార్ హీరో తనయుడు డైరెక్టర్ అవుతాడట.. మొదట డైరెక్ట్ చేసేది ఎవర్నో తెలుసా??

Vijay Son sanjay wants to be a director

Vijay Son :  తమిళ్ స్టార్ హీరో విజయ్ కి తమిళనాడులో ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. విజయ్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వచ్చిందంటే తమిళనాడులో పండగే. అలాంటి స్టార్ హీరోకి కొడుకు ఉంటే కచ్చితంగా హీరో అవుతారనే అనుకుంటారు అంతా. కానీ విజయ్ తనయుడు డైరెక్టర్ అవుతాడని విజయ్ తండి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా డైరెక్టర్ అవ్వబోతున్నట్టు, త్వరలోనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు.

Samantha : సమంత చేతిలో జపమాల.. మొన్న, ఇవ్వాళ కూడా.. ఎందుకో తెలుసా??

విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంజయ్ ప్రస్తుతం విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు చేస్తున్నాడు. సంజయ్ భవిష్యత్తులో డైరెక్టర్ అవుతాడు. సంజయ్ డైరెక్టర్ అయ్యాక విజయ్ సేతుపతితో మొదటి సినిమా చేస్తాడని తెలిపాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న విజయ్ తో సినిమా చేస్తా అన్నాడు. వాడికి విజయ్ సేతుపతి అంటే ఇష్టం అని తెలిపారు. దీంతో విజయ్ తనయుడు ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా, వాళ్ళ నాన్నని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడా అని విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.