Varasadu: విజయ్ వారసుడు దుమ్ములేపుతున్నాడుగా.. నిజంగానే వర్కవుట్ అయ్యేనా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగునాట కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Varasadu: విజయ్ వారసుడు దుమ్ములేపుతున్నాడుగా.. నిజంగానే వర్కవుట్ అయ్యేనా?

Vijay Varasadu Doing Stunning Pre-Release Business

Varasadu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగునాట కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే విధంగా ఉండటంతో ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Vaarasudu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

విజయ్ వారసుడు సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించగా, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా తమిళ నాన్-థియేట్రికల్ అండ్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.280 కోట్ల మేర బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు రైట్స్ కూడా క్లోజ్ అయితే విజయ్ మూవీ ఏకంగా రూ.300 కోట్ల మార్క్ ప్రీరిలీజ్ బిజినెస్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తోంది.

Vijay: ‘వారసుడు’లో విజయ్ రోల్ ఇదేనా..?

అయితే ఈ సినిమాలో విజయ్ రెమ్యునరేషన్ కూడా కళ్లుచెదిరేలా ఉండటం విశేషం. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.90 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.