Varisu: విజయ్ ‘వారిసు’ ఓటీటీ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్ చేశారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ కాగా, ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

Varisu: విజయ్ ‘వారిసు’ ఓటీటీ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్ చేశారా..?

Vijay Varisu OTT Streaming Date Locked

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ కాగా, ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

Varisu: వారిసు సినిమాలో ఆ హీరోయిన్‌ను లేపేశారా..?

కాగా, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా తమిళనాట అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్‌కు అభిమానులు పట్టం కడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లా‌ట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Varisu: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న వారిసు

దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10న ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్, అమెజాన్ ప్రైమ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, తెలుగులో వారసుడు అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో చూడాలి.