Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న కేజీఎఫ్2ను తీసుకొస్తామని ముందే చెప్పినా.. దానికి ఒక రోజు ముందే బరిలోకి దిగుతామని థళపతి తేల్చేేశాడు.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

Movie Releases

Movie Releases: రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న కేజీఎఫ్2ను తీసుకొస్తామని ముందే చెప్పినా.. దానికి ఒక రోజు ముందే బరిలోకి దిగుతామని థళపతి తేల్చేేశాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుండటంతో, షాహిద్ కపూర్ జెర్సీకి పోటీ తప్పలేదు. హై ఎక్స్పెక్టేషన్స్ తో రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది?

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే!

కన్నడ రాకింగ్ స్టార్.. తమిళ్ షేకింగ్ స్టార్ మధ్య పోటీ.. పీక్స్ కు చేరుకుంది. మా హీరో తోపంటే, మా హీరో తురుమ్ అనే ఫ్యాన్స్ వార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక వైపు తమిళ్ స్టార్ హీరో యాక్షన్ ఎంటర్ టైనర్ బీస్ట్ ఏప్రిల్ 13న, కన్నడ కలెక్షన్ స్టార్ యష్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14న ధియేటర్లోకొస్తున్నాయి. ఈ రెండిటి మధ్యలో షాహిద్ కపూర్ జెర్సీ తో తన లక్ చెక్ చేస్కోడానికి కిందా మీదా పడుతున్నాడు.

KGF2: ట్రైలర్‌తో స్పాట్ పెట్టేసిన రాఖీభాయ్.. అంచనాలకు మించి కేజీఎఫ్2!

నిజానికి ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2 రిలీజ్ అవుతోందని ఎప్పుడో ఆర్నెల్ల క్రితమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. కానీ తమిళ్ స్టార్ హీరో విజయ్.. నేను కూడా ఇప్పుడే ధియేటర్లోకి వస్తానంటూ సడెన్ గా అనౌన్స్ చేశారు. దాంతో ఒకరోజు అటూ ఇటూగా ఇద్దరి మధ్యా బాక్సాఫీస్ వార్ గ్యారంటీ అంటున్నారు ఫాన్స్. ఈ బిగ్గెస్ట్ మూవీస్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చెయ్యడంతో ఇప్పటికే లాస్ట్ ఇయర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న జెర్సీ కూడా ఏప్రిల్ 14నే ధియేటర్లోకి వద్దామని డిసైడ్ అయ్యింది. దాంతో ఈ మూడు సినిమాల మధ్య ఇటు సౌత్ నుంచి నార్త్ వరకూ ఫుల్ కాంపిటీషన్ ఉంది.

OTT Release: థియేటర్‌లో క్రేజీ సినిమాలు.. అయినా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

తమిళనాడులో దళపతి విజయ్ కు హ్యూజ్ మార్కెట్ ఉంది. విజయ్ మూవీ రిలీజవుతుందంటే అక్కడ పక్క రాష్ట్రాల హీరోలని పెద్దగా పట్టించుకోరు. తెలుగులోనూ 11 కోట్లకు బీస్ట్ రైట్స్ ను ఇచ్చేసి గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ భారీగా ఎక్స్ పెక్ట్ చేసేది తమిళ్ మార్కెట్ ని మాత్రమే. కానీ ఈ సారి పాన్ ఇండియా వైడ్ గా తన క్రేజ్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేసి ఆల్రెడీ సౌత్ మీద ఉన్న క్రేజ్ నిక్యాష్ చేస్కోవాలనుకుంటున్నారు.

RRR: పుష్ప దారిలోనే ఆర్ఆర్ఆర్.. సౌత్‌లో ముందే ఓటీటీ రిలీజ్?

ఆల్రెడీ సాలిడ్ ట్రైలర్ తోనే థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడంటూ కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు పెంచేశాడు. థియేట్రికల్ ట్రయిలర్ కు ఎవరి ఊహలకూ అందనంత రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 109 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైమ్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం హిందీ వెర్షన్ ట్రయిలర్ 24 గంటల్లోనే 5కోట్ల పది లక్షల వ్యూస్ సాధించి ఆడియన్స్ తో పాటు, మేకర్స్ ను షాక్ కు గురిచేసింది.
Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

కేజిఎఫ్ రిలీజ్ అవుతున్న ఏప్రిల్ 14నే షాహిద్ కపూర్, మృణాల్ థాకూర్ కాంబినేషన్ లో హిందీ జెర్సీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. తెలుగులో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ రీమేక్ సినిమా పైన గౌతమ్ తిన్ననూరి హిందీతో పాటు, పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే పెట్టుకున్నాడు. సేమ్ డేట్ న కేజిఎఫ్ 2, ఒక రోజు ముందే బీస్ట్ సినిమాలు వస్తుండటంతో ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ జెర్సీ కలెక్షన్స్ పైన పడే అవకాశం ఉంది. ఆ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే, జెర్సీ హిందీకే పరిమితం కావాల్సి వస్తుందని ఫీలవుతున్నాడు.