Vijay Devarakonda : ‘రౌడీ బాయ్స్’ కోసం వస్తున్న రౌడీ స్టార్

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ ‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాత కావడంతో తన సోదరుడు శిరీష్ తనయుడు, తనకి కొడుకు వరస అయ్యే ఆశిష్

Vijay Devarakonda : ‘రౌడీ బాయ్స్’ కోసం వస్తున్న రౌడీ స్టార్

Rowdy (1)

Vijay Devarakonda : ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ ‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాత కావడంతో తన సోదరుడు శిరీష్ తనయుడు, తనకి కొడుకు వరస అయ్యే ఆశిష్ ని గ్రాండ్ గానే లాంచ్ చేస్తున్నాడు. ప్ర‌మోష‌న్స్‌ కూడా భారీగా చేస్తున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేసి ఈ సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పుడు మ‌రో సాంగ్ రిలీజ్ కి భారీగానే ప్లాన్ చేశారు.

ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమా ‘హుషారు’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అందించిన శ్రీ హర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సన్నాహాల్లో ఉంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది.

Ashu Reddy : నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు..

ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండతో లాంచ్ చేయించబోతున్నారు. అయితే ఈ సాంగ్ లాంచ్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. అక్టోబ‌ర్ 20 సాయంత్రం హైదరాబాద్ లోని N కన్వెన్షన్ సెంటర్లో విజయదేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రేక్ష‌కుల న‌డుమ ఈ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. సాంగ్ లాంచింగ్ కే ఈ రేంజ్ లో ఈవెంట్ ప్లాన్ చేశారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగానే ప్లాన్ చేస్తారనే తెలుస్తుంది.