నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్

నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్

నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్

టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసిన నటుడు ‘విజయ్ దేవరకొండ’. తన డైలాగ్‌లతో, హవభావాలతో యువతను తెగ ఆకట్టుకున్న ఈ నటుడంటే యమ క్రేజ్. ఆయన ఏదైనా చిత్రంలో నటిస్తున్నాడంటే దానిపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. వరుసగా సినిమాలు సక్సెస్ కావడంతో స్టార్ హీరో హోదాకి ఎదిగిపోయాడు ఈ నటుడు. తాజాగా ఇతను ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే టీజర్ విడుదలై ఆకట్టుకొంటోంది. 
Read Also : ఓరి ద్యావుడా : చచ్చిన ఎలుకలతో వైన్, గబ్బిలాల సూప్

అర్జున్ రెడ్డి, గోతా గోవిందం, టాక్సీవాలా చిత్రాల్లో వైవిధ్యమైన రోల్స్ పోషించాడు ‘విజయ్’. భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘విజయ్’ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. ఇతని సరసన నటిస్తున్న ‘రష్మిక మందన’ క్రికెటర్‌గా నటిస్తోందని టాక్. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 31న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

×