Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..

కమలహాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ముఖ్యపాత్రల్లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిన సినిమా విక్రమ్ అందర్నీ మెప్పిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విజయంపై కమల్.................

Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..
ad

Vikram : 3 వారాల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ ఇంకా వసూళ్ల విద్వంసం సృష్టిస్తుంది. 4 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన కమల్ హాసన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వరసగా ఫ్లాపుల తర్వాత సీనియర్ హీరో కమల్ హాసన్ కి కమ్ బ్యాక్ బాక్సాఫీస్ బద్దలయ్యే రేంజ్ లో వచ్చింది. ఇదే స్పీడ్ లో కొన్ని రికార్డులు క్రియేట్ చేసిన విక్రమ్ లేటెస్ట్ గా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

కమలహాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ముఖ్యపాత్రల్లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిన సినిమా విక్రమ్ అందర్నీ మెప్పిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విజయంపై కమల్ చాలా సంతోషంగా ఉన్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కోవిడ్ తరవాత హిట్ కొట్టిన ఫస్ట్ సినిమాగా కమల్ హాసన్ విక్రమ్ ట్రెండ్ సెట్ చేసింది. ఇండియాలోనే కాదు గ్లోబల్ బాక్సాఫీస్ లెవల్లో కూడా విక్రమ్ మంచి కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్ ని ట్రాక్ లో పెట్టింది.

Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్‌స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

రోబో 2 తర్వాత ఈ రికార్డ్ సాధించిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఎప్పుడో ఇలాంటి కలెక్షన్ల నంబర్స్ ని చూసింది తమిళ సినిమా. ఈమధ్య కాలంలో ఎంత మంది స్టార్ హీరోలు ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా సినిమాలు తీసినా 100కోట్లు దాటటమే కష్టమైపోయింది. అలాంటిది 4 ఏళ్ల తర్వాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో 400కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇదే బాక్సాఫీస్ స్పీడ్ కంటిన్యూ అయితే 500 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఫాన్స్.