Vikram: దారుణంగా విక్రమ్ టీఆర్పీ.. వెండితెరపై గ్రాండ్ సక్సెస్.. బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు, ఈ సినిమాలోని యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లతో పాటు కేమియో రోల్ చేసిన సూర్యల పర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను ఈ సినిమాకు అడిక్ట్ చేశాయి. అయితే.. ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Vikram: దారుణంగా విక్రమ్ టీఆర్పీ.. వెండితెరపై గ్రాండ్ సక్సెస్.. బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్!

Vikram Gets Low TRP In First World Television Premiere

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు, ఈ సినిమాలోని యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లతో పాటు కేమియో రోల్ చేసిన సూర్యల పర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను ఈ సినిమాకు అడిక్ట్ చేశాయి. ఇక ఈ సినిమా టేకింగ్‌తో లోకేశ్ కనగరాజ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

Vikram: సెంచరీ కొట్టిన విక్రమ్.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. చాలా కాలం తరువాత కమల్ హాసన్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది విక్రమ్ మూవీ. ఇక ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌ల పాత్రలు ప్రేక్షకులను అలరించగా.. రోలెక్స్ సార్ పాత్రలో సూర్య పవర్‌ఫుల్ కేమియో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా, ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండగా, అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. అయితే.. ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

విక్రమ్ తెలుగు వర్షన్ చిత్రాన్ని ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు కేవలం 5.1 టీఆర్పీ రేటింగ్ రావడంతో సినీ వర్గాలు అవాక్కయ్యాయి. వెండితెరపై గ్రాండ్ సక్సెస్ అయిన విక్రమ్, బుల్లితెరపై ఇలాంటి దారుణమైన టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేయడమేమిటని వారు అంటున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులోకి రావడమే దీనికి కారణమని వారు అంటున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన చాలా మంది, ఓటీటీల్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారని.. అందుకే బుల్లితెరపై ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపలేదని తెలుస్తోంది. ఏదేమైనా విక్రమ్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.