Vikram: విక్రమ్ తెలుగు స్టేట్స్ ఫస్ డే కలెక్షన్స్.. మరీ ఇంతా?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ రిలీజ్‌కు ముందే సౌత్ ఇండస్ట్రీలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించడంతో....

Vikram: విక్రమ్ తెలుగు స్టేట్స్ ఫస్ డే కలెక్షన్స్.. మరీ ఇంతా?

Vikram Telugu States First Day Collections

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ రిలీజ్‌కు ముందే సౌత్ ఇండస్ట్రీలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందర ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టారు.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఊరమాస్ లుక్‌లో యాక్షన్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయ్యింది. అంతేగాక ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి యాక్టర్స్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు తమిళ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు. అయితే తమిళంతో పాటు ఈ సినిమాకు తెలుగులోనూ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. తెలుగు నాట కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున నిర్వహించారు.

Vikram: విక్రమ్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

దీంతో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లారు. అయితే తొలిరోజు ఈ సినిమాకు ఇక్కడ మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా కంటే కూడా మేజర్ సినిమాను చూసేందుకే తెలుగు ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తిని చూపించారు. దీంతో విక్రమ్ సినిమాకు అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. తమిళ డబ్బింగ్ సినిమా కంటే కూడా దేశభక్తిని చాటిచెప్పే స్ట్రెయిట్ తెలుగు మూవీని చూసేందుకే ఆడియెన్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.96 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ సినిమా తెలుగునాట బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే రూ.8.5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మరి ఈ వీకెండ్ ఈ సినిమాకు ఎంతమేర వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి. ఇక ఏరియాల వారీగా విక్రమ్ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 66 లక్షలు
సీడెడ్ – 27 లక్షలు
ఉత్తరాంధ్ర – 30 లక్షలు
ఈస్ట్ – 18 లక్షలు
వెస్ట్ – 13 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
నెల్లూరు – 10 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.1.96 కోట్లు( రూ.3.70 కోట్ల గ్రాస్)