Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!

తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది....

Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!

Vikram

Vikram: తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై యావత్ సౌత్ ఇండస్ట్రీల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ తమిళ తంబీలను ఉర్రూతలూగిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తమిళ, హిందీ ట్రైలర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ అంశాలతో నింపేశాడు దర్శకుడు. కమల్ హాసన్ బేస్ వాయిస్‌తో చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్‌కే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తుండటం ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ అని చెప్పాలి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కమల్‌కు పోటీగా తమ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!

ఇక చాలా కాలం తరువాత కమల్ తనలోని యాక్షన్ హీరోను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో సూర్య కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తెలుగులో చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ సినిమాపై ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.