Vikrant Rona: ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ రోణ చార్జ్ తీసుకునేంది ఆరోజు నుంచే!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారి కోసం, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

Vikrant Rona: ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ రోణ చార్జ్ తీసుకునేంది ఆరోజు నుంచే!

Vikrant Rona Telugu Version OTT Release Date Locked

Vikrant Rana: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు అనూప్ భండారి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. కేవలం కన్నడలోనే కాకుండా, ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

Vikrant Rona: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న విక్రాంత్ రోణ

ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారి కోసం, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 16 నుంచి విక్రాంత్ రోణ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Vikrant Rona: నాలుగే రోజులు తీసుకున్న సుదీప్.. వారెవ్వా!

ఈ సినిమాలో సుదీప్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో నీతా అశోక్, జాక్వెలిన్ ఫర్నాండెజ్, నిరూప్ భండారి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మరి ఓటీటీలో విక్రాంత్ రోణ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటాడో తెలియాలంటే సెప్టెంబర్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.