Sonusood: భూమికి పచ్చని రంగేసినట్లే.. 50వేల చదరపు అడుగుల్లో సోనూసూద్!

కరోనా సమయంలో ప్రజల మెస్సీయగా మారిపోయిన సీనీ నటుడు సోను సూద్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్నారు. జూలై 30న, సోనూ తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు.

Sonusood: భూమికి పచ్చని రంగేసినట్లే.. 50వేల చదరపు అడుగుల్లో సోనూసూద్!

Sonusood

50thousand sq.ft portrait: కరోనా సమయంలో ప్రజల మెస్సీయగా మారిపోయిన సీనీ నటుడు సోను సూద్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్నారు. జూలై 30న, సోనూ తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. అతని పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు సోనుసూద్ ఇంటి బయట గుమికూడి హడావుడి చేశారు. ప్రతి ఒక్కరూ తమ మెస్సీయను అభినందించేందుకు వచ్చారు. ఇది మాత్రమే కాదు, అభిమానుల అపారమైన ప్రేమ సోషల్ మీడియాలో ఆరోజు కనిపించింది.

సోనూ సూద్ పుట్టినరోజు సంధర్భంగా అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రోజంతా సోను ఇంటి బయట పండుగ వాతావరణం కనిపించింది. అభిమానులు తమ అభిమాన సోను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వారి ఇంటి వెలుపల గుమికూడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూసూద్ పుట్టినరోజు సంధర్భంగా అబిమానులు చేసిన పనులు వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్‌గా భూమీకి పచ్చాని రంగద్దినట్లుగా.. పచ్చదనంతో సోనూసూద్ పెయింటింగ్ భూమిపై వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనూసూద్.. డ్రోన్ కెమెరాలతో వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మహారాష్ట్రకు చెందిన విపుల్ మిరాజ్కర్ అనే వ్యక్తి 20 రోజుల్లోపు ఈ భారీ 50వేల చ.అడుగుల చిత్రపటాన్ని క్రియేట్ చేశాడు. దీనిని చూసిన సోనూసూద్ ఆశ్చర్యపోయారు. ఇలాంటిది సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ క్రియేట్ చేసిన విపుల్‌కి ధన్యవాదాలు తెలిపారు.