Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?

యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.....

Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?

Virata Parvam 3 Days Worldwide Collections

Virata Parvam: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల నక్సల్ నేపథ్యంలో తెరకకెక్కించారు. అయితే ప్రేమ కోసం ఎంత దూరం అయినా వెళ్లే అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా తొలి వారాంతం ముగిసినా కూడా యావరేజ్ వసూళ్లతో నెట్టుకొస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3.14 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కంటెంట్ పరంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కినా, ఈ సినిమాకు వసూళ్లు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!

కాగా.. ఈ సినిమాలో రానా దగ్గుబాటి రవన్న అనే నక్సల్ పాత్రలో అదరగొట్టగా, సాయి పల్లవి క్రేజ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.11 కోట్లు
సీడెడ్ – 17 లక్షలు
ఉత్తరాంధ్ర – 20 లక్షలు
ఈస్ట్ – 15 లక్షలు
వెస్ట్ – 11 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
కృష్ణా – 12 లక్షలు
నెల్లూరు – 8 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.2.09 కోట్లు (రూ.3.40 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – రూ.0.25 కోట్లుః
ఓవర్సీస్ – 0.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.3.14 కోట్లు (రూ.5.35 కోట్లు)