Virata Parvam: ముందుకు దూకిన విరాటపర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన నటించిన ‘విరాట పర్వం’ ఎప్పుడో....

Virata Parvam: ముందుకు దూకిన విరాటపర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

Virata Parvam Locks New Release Date

Virata Parvam: టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన నటించిన ‘విరాట పర్వం’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా, రిలీజ్ మాత్రం కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఇటీవల జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి, ఆ తరువాత మళ్లీ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రేక్షకులు మరోసారి నిరాశకు గురయ్యారు.

Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది!

అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. విరాటపర్వం చిత్రాన్ని గతంలో చెప్పిన తేదీ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త రిలీజ్ వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Virata Parvam : ‘విరాట పర్వం’ వాయిదా.. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామంటున్న మేకర్స్..

ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో రాబోతుండగా, రానా దగ్గుబాటి ఇందులో ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటుందో చూడాలి.