Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!

విరాటపర్వం.. దర్శకుడు వేణు ఊడుగుల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కరోనా కారణంగా చాలా కాలం తరువాత జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా.....

Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!

Virata Parvam Ott Streaming From July 1st On Netflix

Virata Parvam: విరాటపర్వం.. దర్శకుడు వేణు ఊడుగుల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కరోనా కారణంగా చాలా కాలం తరువాత జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించినా.. సినిమా కథ మొత్తం సాయి పల్లవి చేసిన ‘వెన్నెల’ అనే పాత్ర చుట్టూ తిరుగుతుందని.. ఇది సాయి పల్లవి కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అని చిత్ర యూనిట్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక సినిమా రిలీజ్‌కు ముందర ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహించి ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?

అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చినా, అది ఈ సినిమాను కమర్షియల్‌గా గట్టెక్కించలేక పోయింది. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా, ఇది రియల్‌గా జరిగిన కథే అని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వచ్చినా, ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్‌గా వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి గట్టి పోటీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం విరాటపర్వం తేలిపోయింది. దీంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!

అవును.. విరాటపర్వం సినిమా థియేటర్ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోవడంతో, ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను జూలై 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. కంటెంట్ ఉన్న సినిమా అయినా కూడా చాలా ఆలస్యం కావడంతో ఈ సినిమాపై జనంలో ఆసక్తి తగ్గిపోవడమే ఈ సినిమాను సక్సెస్‌కు దూరం చేసిందని చిత్ర విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విరాటపర్వం ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతలా మెప్పిస్తుందో తెలియాలంటే జూలై 1 వరకు వెయిట్ చేయాల్సిందే.