Virata Parvam: విరాటపర్వం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో ‘విరాటపర్వం’ కూడా ఒకటి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో....

Virata Parvam: విరాటపర్వం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

Virata Parvam Trailer Release Date Locked

Virata Parvam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో ‘విరాటపర్వం’ కూడా ఒకటి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదులకొని టీజర్, సాంగ్స్ వరకు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.

Virata Parvam: నాగాదారిలో.. వెన్నెల ప్రేమ గెలుస్తుందా లేదా?

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. విరాటపర్వం చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను జూన్ 5న సాయంత్రం 5 గంటలకు కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమా నక్సల్ నేపథ్యంలో వస్తున్నా, ఇందులోని ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Virata Parvam: ముందుకు దూకిన విరాటపర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇక ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మరి విరాట పర్వం చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.