Virata Parvam : ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. ముఖ్యంగా మహిళల సినిమా..

విరాటపర్వం లాంటి సినిమాలను తెలుగులోనే చేయాలి. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఒక భాషకు చెందిన సాహిత్యం మరో భాషలో ఉండకపోవచ్చు. అందుకే ‘విరాటపర్వం’ సినిమాని పాన్‌ ఇండియాగా..................

Virata Parvam : ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. ముఖ్యంగా మహిళల సినిమా..

Virataparvam

Rana Daggubati :  రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవుతుంది. నక్సల్స్ కథలో ప్రేమ కథని జోడించి తీసిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ జనాలకి విపరీతంగా నచ్చాయి. సినిమా త్వరలో రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా అంటాయని, సినిమా కథ అంతా సాయిపల్లవి చుట్టే తిరుగుతుందని తెలిపారు హీరో, డైరెక్టర్ పలు ప్రమోషన్స్ లో తెలిపారు.

తాజాగా రానా దగ్గుబాటి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా సినిమా గురించి ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. రానా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో రవన్న, వెన్నెల పాత్రలే కాదు సినిమాలో ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళుతుంది. ప్రియమణి, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, నందితా దాస్‌.. ఇలా ప్రతి పాత్ర బలంగానే ఉంటుంది. సినిమా చూశాక అబ్బాయిలు వావ్‌ అని ఆశ్చర్యపోతే. మహిళలు మాత్రం కచ్చితంగా కంటతడి పెడతారు. ఇది మహిళల చిత్రం. రవన్న పాత్రలో ఎవరైనా నటించగలరు కానీ వెన్నెల పాత్రను
సాయిపల్లవి తప్ప వేరేవాళ్లు ఎవ్వరూ చేయలేరు.”

Kamal Haasan : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట..

”విరాటపర్వం లాంటి సినిమాలను తెలుగులోనే చేయాలి. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఒక భాషకు చెందిన సాహిత్యం మరో భాషలో ఉండకపోవచ్చు. అందుకే ‘విరాటపర్వం’ సినిమాని పాన్‌ ఇండియాగా అనుకోవట్లేదు. అయినా పాన్‌ ఇండియా అనేది కథలో ఉండాలి, మనం పాన్‌ ఇండియా చేయాలని చేస్తే కుదరదు. కానీ ‘విరాటపర్వం’ సినిమాను మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో డబ్‌ చేస్తున్నాం. ఈ సినిమా కోసం నేను తొలిసారి ఓ పాట కూడా పాడాను.” అని తెలిపారు.