Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విరూపాక్ష

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విరూపాక్ష

Virupaksha Movie First Single Song Announcement

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

Virupaksha Trailer: ఉగాది కానుకగా విరూపాక్ష ట్రైలర్‌ను పట్టుకొస్తున్న తేజు..?

కాగా, ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మార్చి 24న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్‌తో పాటు అందాల భామ సంయుక్తా మీనన్ కూడా కనిపించింది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Virupaksha Trailer: ఉగాది కానుకగా విరూపాక్ష ట్రైలర్‌ను పట్టుకొస్తున్న తేజు..?

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏప్రిల్ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.