Vishal : చాలా బాధగా ఉంది.. ఉదయనిధి మంత్రిగా ఆ పనులు చేయాలి.. విశాల్ వ్యాఖ్యలు..

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. యువత, క్రీడా శాఖలని ఆయనకి అప్పచెప్పారు. దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ఉదయనిధి స్టాలిన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లాఠీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.........

Vishal : చాలా బాధగా ఉంది.. ఉదయనిధి మంత్రిగా ఆ పనులు చేయాలి.. విశాల్ వ్యాఖ్యలు..

Vishal comments on Udayanidhi stalin

Vishal :  విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా లాఠీ. ఈ సినిమాని డిసెంబర్ 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. పొలిసు వ్యవస్థలో కానిస్టేబుల్స్ జీవితాలు ఆధారంగా కమర్షియల్ పాయింట్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. గత కొన్ని రోజులుగా విశాల్ లాఠీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. యువత, క్రీడా శాఖలని ఆయనకి అప్పచెప్పారు. దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ఉదయనిధి స్టాలిన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లాఠీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఉదయనిధి స్టాలిన్ పై కామెంట్స్ చేశాడు.

Sukumar : రంగస్థలం సినిమాలో అనుపమని హీరోయిన్ గా అనుకున్నాం.. కానీ..

విశాల్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. అతను సినీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. చెన్నైలో ఫిలిం సిటీ లేకపోవడం చాలా బాధాకరం. ఉదయనిధి ఆ వైపుగా దృష్టి పెట్టి చెన్నైలో ఫిలిం సిటీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలిపాడు. మరి ఒక సినిమా హీరో మంత్రి అవ్వడం అక్కడ సినీ రంగానికి ఎంతవరకు తోడ్పడుతుందో చూడాలి.