Vishal : గుండె పై ఆ నాయకుడు టాటూ వేయించుకున్న విశాల్..

తమిళ హీరో విశాల్ చుట్టూ గత కొంత కాలంగా రాజకీయ పరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో విశాల్ పోటీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి రాజకీయ పరంగా విశాల్ పేరు వినిపిస్తుంది.

Vishal : గుండె పై ఆ నాయకుడు టాటూ వేయించుకున్న విశాల్..

Vishal has that leader tattooed on his heart

Vishal : తమిళ హీరో విశాల్ చుట్టూ గత కొంత కాలంగా రాజకీయ పరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో విశాల్ పోటీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. విశాల్ కుటుంబానికి కుప్పంలో వ్యాపార లావాదేవీలు ఉండడంతో, అక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ తరుపు నుంచి విశాల్, చంద్రబాబు పై పోటీ చేయనున్నాడు అంటూ గట్టిగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అవాస్తం అంటూ విశాల్ కొట్టి పారేశాడు. ఇప్పుడు మరోసారి రాజకీయ పరంగా విశాల్ పేరు వినిపిస్తుంది.

Vishal : పవన్ అంటే అభిమానం.. జగన్ అంటే ప్రేమ.. విశాల్!

తమిళ దిగ్గజ నటుడు మరియు రాజకీయనేత ‘ఎంజీఆర్’ కి విశాల్ అభిమానాన్ని అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంజీఆర్ ఫోటోని తన గుండెల పై టాటూ వేయించుకున్నాడు విశాల్. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఏ సందర్భం లేకుండా విశాల్ ఈ టాటూ వేయించుకోవడం ఎన్నో చర్చలకు దారి తీస్తుంది. గతంలో జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేదాం అని అనుకోని నామినేషన్ వేశాడు. అయితే అది కాస్త రిజెక్ట్ అయ్యింది. ఆ తరువాత కూడా రాజకీయంలోకి రావడం పక్కా అంటూ చెబుతూ వచ్చాడు విశాల్.

ఈ మధ్య కాలంలో.. విశాల్ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరుపు నుంచి పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీకి, ప్రజలకి దగ్గర అయ్యేందుకు విశాల్ ఎంజీఆర్ ఫోటోని టాటూ వేయించుకున్నాడు అంటూ కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇది ఏదైనా సినిమా కోసం అయ్యి ఉండవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ టాటూ వెనుక కథ ఏంటో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. కాగా విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ, డిటెక్టీవ్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.