VIshal : సంక్రాంతి బరిలో విశాల్ ‘సామాన్యుడు’

తమిళ్ స్టార్ హీరో విశాల్ కూడా సంక్రాంతి బరిలోకి దిగాడు. విశాల్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో విశాల్ నెక్స్ట్ సినిమా 'సామాన్యుడు' ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు.......

VIshal : సంక్రాంతి బరిలో విశాల్ ‘సామాన్యుడు’

Vishal

VIshal :   సంక్రాంతి తెలుగు వాళ్లకి ఎంత పెద్ద పండగో మన అందరికి తెలిసిందే. సినిమాలకి కూడా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కాని ఈ సంక్రాంతికి కరోనా వల్ల, ఏపీలో థియేటర్స్, టికెట్ రేట్ల ప్రాబ్లమ్ వల్ల పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో చిన్న సినిమాలన్నీ ఒకే సారి క్యూ కట్టాయి. పెద్ద సినిమాల్లో ‘రాధేశ్యామ్’ కూడా ఇంకా డౌట్ గానే ఉంది. ఇక ‘బంగార్రాజు’ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే చాలు అని రిలీజ్ కి సిద్ధమైపోయింది.

‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడటంతో దొరికిందే మంచి ఛాన్స్ అనుకోని సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలని చాలా చిన్న సినిమాలు ఒకేసారి సంక్రాంతికి విడుదలని అనౌన్స్ చేశాయి. ‘అతిధి దేవోభవ’, ‘డీజే టిల్లు’, ‘హీరో’, ‘సూపర్ మచ్చి’, ‘రౌడీ బాయ్స్’, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి చిన్న సినిమాలన్ని రాబోతున్నాయి. వీటితో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ కూడా సంక్రాంతికే రాబోతుంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సినిమా చేరింది.

Balakrishna : మాస్ డైరెక్టర్‌తో మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

తమిళ్ స్టార్ హీరో విశాల్ కూడా సంక్రాంతి బరిలోకి దిగాడు. విశాల్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో విశాల్ నెక్స్ట్ సినిమా ‘సామాన్యుడు’ ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతుంది. తమిళ్ లో సంక్రాంతికి పెద్ద సినిమాల్లో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా ఒక్కటే ఉండటంతో ఈ సినిమా కూడా రెడీ అయిపోయింది.