Vishal : మరోసారి మాస్ పోలీస్ పాత్రలో విశాల్.. అదరగొట్టిన లాఠీ టీజర్..

లాఠీ సినిమా షూట్ లో రెండు సార్లు గాయపడటంతో ఈ సినిమా షూట్ ఆలస్యం అయింది. దీంతో సినిమా వాయిదా పడింది. తాజాగా లాఠీ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫుల్ మాస్ యాక్షన్ గా సాగింది. ఇందులో విశాల్...........

Vishal : మరోసారి మాస్ పోలీస్ పాత్రలో విశాల్.. అదరగొట్టిన లాఠీ టీజర్..

Laatti

Vishal :  తెలుగు వాడైనా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా యాక్షన్ సినిమాల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాడు. పందెంకోడి సినిమాతోనే తెలుగు వాళ్ళకి దగ్గరయి తన ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం విశాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో లాఠీ అనే సినిమా ఇటీవలే షూట్ పూర్తి చేసుకుంది.

లాఠీ సినిమా షూట్ లో రెండు సార్లు గాయపడటంతో ఈ సినిమా షూట్ ఆలస్యం అయింది. దీంతో సినిమా వాయిదా పడింది. తాజాగా లాఠీ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫుల్ మాస్ యాక్షన్ గా సాగింది. ఇందులో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ మొదట్లోనే ‘రేయ్ త‌ప్పుచేసి త‌ల దాచుకునే పోకిరివి నీకే అంత పొగురుంటే, ఆ త‌ప్పును నిల‌దీసే పోలీసోడ్ని నాకెంతుండాలి’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలు పెట్టి, టీజ‌ర్ మొత్తం యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ఫుల్‌గా నింపేసి చివ‌ర్లో ‘ఊర్లో ఉన్న పోకిరి పోరంబోకులంద‌రూ ఒక‌టై న‌న్ను లేపేయ‌డానికి ఎదురు చూస్తున్నారు క‌ద‌రా ఇక్క‌డి నుంచి ఒక్క‌డు కూడా ప్రాణాల‌తో వెళ్ళ‌డు. ఇప్పుడు రండ్రా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాడు విశాల్.

KTR : నీ గురించి వింటున్నా చరణ్.. చరణ్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన కేటీఆర్‌..

ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఉండటంతో విశాల్ అభిమానులతో పాటు మాస్ సినిమాలని ఇష్టపడే సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు లో రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ కి వాయిదా పడింది. ఈ సినిమా షూట్ చాలా వరకు హైదరాబాద్ లోనే జరిగింది.