Vishal – Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా.. విశాల్!

కోలీవుడ్ హీరో విశాల్ ని పెళ్లి గురించి ప్రశ్నించగా ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా అంటూ చెప్పుకొస్తూనే..

Vishal – Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా.. విశాల్!

Vishal said he married after prabhas getting married

Vishal – Prabhas : కోలీవుడ్ హీరో విశాల్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసేస్తున్నాడు. విశాల్ చివరిగా ‘లాఠీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేక పోయింది. ప్రస్తుతం మార్క్ ఆంటోనీ (Mark Antony), డిటెక్టివ్ 2 (Detective 2) సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, విశాల్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ల సంగీతం.. NTR30 టు Nani30..

విశాల్ పెళ్లి విషయంలో గతంలో అనేక వార్తలు వచ్చాయి. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడని ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తెలియజేశారు ఇద్దరు. ఇక ఇటీవల విశాల్ హైదరాబాద్ కి చెందిన అనిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ప్రముఖ సినీ నటి అభినయతో ప్రేమలో ఉన్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని గురించి విశాల్ ని ప్రశ్నించగా.. వాటిలో వస్తాం లేదని చెప్పేశాడు.

Prabhas – Anushka : ప్రభాస్‌ని అనుష్క ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా.. పోస్ట్ వైరల్!

ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని ప్రశ్నించగా.. “పెళ్లి అనేది జోక్ కాదు. అది ఒక బాధ్యత. నాకు ఇప్పుడు ప్రొఫెషనల్ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత డెడికేషన్ గా ఉంటామో పర్సనల్ లైఫ్ లో కూడా అలాగే ఉండాల్సి వస్తుంది. పెళ్ళి జీవితానికి తగ్గట్టు నా మైండ్ సెట్ ఇంకా సిద్ధం కాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. చివరిగా పెళ్లి గురించి సరదాగా మాట్లాడుతూ.. ”ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.