Vishal : పునీత్ బాధ్యత నేను తీసుకుంటాను : విశాల్

ఇప్పటి వరకూ పునీత్ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా ఇకపై నేను చదివిస్తానని అన్నారు. ఈ వేదికగా ఆ విద్యార్థులు బాధ్యత నాది అని పునీత్‌కి మాటిస్తున్నా అన్నారు. అంతే కాక

Vishal : పునీత్ బాధ్యత నేను తీసుకుంటాను : విశాల్

Vishal

Vishal :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త అందరిని కలిచివేసింది. నిన్న ఆయన అంతక్రియలు ముగిసాయి. కన్నడ పరిశ్రమకి ఆయన మరణం తీరని లోటు. ఆయన రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. పునీత్ చారిటీ ద్వారా ఎంతోమందికి సేవ చేశారు. స్కూల్స్ ని, హాస్పిటల్ ని కట్టించారు. వేల మంది విద్యార్థుల‌కు విద్యని అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. ఆయన మరణంతో ఈ సేవ కార్యక్రమాలు ప్రశ్నగా మిగిలిపోయాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు వీటిని నడిపించొచ్చు. కానీ ప్రస్తుతం వారు పునీత్ లేరు అనే బాధలో ఉన్నారు. వీటిపై ఇప్పట్లో మాట్లాడలేరు. కానీ పునీత్ సేవా కార్యక్రమాలని కొనసాగించడానికి ముందుకొచ్చారు తమిళ్ హీరో విశాల్.

Squid Game: స్క్విడ్‌గేమ్‌లో ‘అలీ’ మనవాడే.. అసలు పేరు అనుపమ్ త్రిపాఠి!

నిన్న సాయంత్రం విశాల్ నెక్స్ట్ సినిమా ‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సినిమా బృందం పునీత్ కి నివాళులు అర్పించారు. విశాల్ మాట్లాడుతూ.. పునీత్‌ రాజ్‌కుమార్‌ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన ఇంకా నా కళ్ళల్లోనే మెదులుతున్నారు అని విశాల్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికి కూడా తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేద‌ని చెప్పారు. మేకప్‌ ఉన్నా, మేకప్‌ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవార‌ని అన్నారు. ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించి, వృద్ధాశ్రమాల్ని నడిపార‌ని అన్నారు. చివరిగా తన కళ్ళను కూడా దానం చేశారు. ఇప్పటి వరకూ పునీత్ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా ఇకపై నేను చదివిస్తానని అన్నారు. ఈ వేదికగా ఆ విద్యార్థులు బాధ్యత నాది అని పునీత్‌కి మాటిస్తున్నా అన్నారు. అంతే కాక పునీత్‌ సేవా కార్యక్రమాలకి నా వంతు సహాయం అందిస్తాను అని విశాల్ చెప్పారు.