విశాల్ హీరో కాదు.. విలన్.. రహస్యాలను బయటపెడుతా!

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 11:13 AM IST
విశాల్ హీరో కాదు.. విలన్.. రహస్యాలను బయటపెడుతా!

విశాల్ సంస్థలో పనిచేస్తున్న రమ్య అనే అకౌంటెంట్ రూ .45 లక్షలను మోసం చేసినట్లుగా ఇటీవల ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ( విఎఫ్ఎఫ్ )’ మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరేళ్లుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రమ్య, ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన టీడీఎస్ మొత్తాన్ని తన ఖాతాలోకి, బంధువుల ఖాతాలోకి మళ్లించి మోసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

పోలీసులు ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న సమయంలోనే రమ్యను మీడియా ఇంటర్వ్యూ చేస్తోంది. ఇందులో విశాల్‌పై పలు ఆరోపణలు చేశారు రమ్య. విశాల్ తన కార్యాలయంలో నిర్వహించే పంచాయతీకి నేను సాక్షిని అని ఆమె అన్నారు. సినిమాల్లో చూసినట్లు అతను హీరోకాదని గొప్ప విలన్ అని ఆమె అన్నారు. మనీలాండరింగ్ ఫిర్యాదు గురించి మాట్లాడుతూ, తాను అలా చేయలేదని నిరూపించడానికి అవసరమైన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. విశాల్ తనను బెదిరించి తన కారును తీసుకున్నాడని రమ్య ఆరోపించింది.

మేనేజర్ హరి అంగరక్షకులతో తనపై, తన కుటుంబంపై దాడి చేశారంటూ రమ్య పోలీసు రక్షణ కోరారు. వివాదానికి సంబంధించిన అన్ని పత్రాలను బహిరంగంగా అధికారులకు అందజేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను తప్పు చేయలేదని నిరూపించడానికి ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు.

విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. విశాల్‌కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని చెప్పింది. రమ్య వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే బెదిరిస్తున్నారని వాపోయింది.

తాను ఇంతకాలమూ ఎంతో సైలెంట్‌గా ఉన్నానని, ఇప్పుడు తనపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని, దాంతో విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చింది.

Must Read>> విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్, 10లక్షల మంది వెనక్కి