ఈసారి డబుల్ ‘ఢీ’ డబుల్ డోస్!

  • Published By: sekhar ,Published On : November 23, 2020 / 12:15 PM IST
ఈసారి డబుల్ ‘ఢీ’ డబుల్ డోస్!

D&D – Double Dose: మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ మూవీ బ్లాక్‌‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా 2007 లో వచ్చింది.



దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుంది. సోమవారం (నవంబర్ 23) విష్ణు పుట్టినరోజు సందర్భంగా వీరి కలయికలో తెరకెక్కబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. Vishnu Manchu - Sreenu Vaitlaఈ మూవీకి ‘ఢీ & ఢీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్‌లైన్.. ప్రేక్షకులకు ‘ఢీ’ ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని మూవీ టీమ్ చెబుతోంది. అవరామ్ భక్త మంచు సమర్పణలో, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి మోహన్ రచన చేశారు.


మహతి సాగర్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యాక్షన్ : పీటర్ హెయిన్, ఎడిటింగ్ : ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్ : చిన్నా.
https://10tv.in/my-team-contacted-you-morning-and-took-the-required-information-manchu-manoj/