Balakrishna : బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు చర్చలు.. ‘మా’ కోసమేనా??

తాజాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 'మా' ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా వెళ్లారు. ఎలక్షన్స్ ముందు కూడా బాలకృష్ణతో పాటు కొంతమంది సీనియర్ హీరోలని

Balakrishna : బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు చర్చలు.. ‘మా’ కోసమేనా??

Balayya

Balakrishna :  ‘మా’ ఎలక్షన్స్ ఎంత హడావిడి సృష్టించాయో చూశాం. ఎలక్షన్స్ రోజు కూడా గొడవలు జరిగాయి. ఎలక్షన్ అయిపోయి మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచారు. అప్పటికైనా ఈ వివాదాలకు తెరపడుతుందని అనుకున్నారు. కానీ రిజల్ట్స్ వచ్చాక ప్రకాష్ రాజ్, నాగబాబులు ‘మా’కి రాజీనామా చేయడంతో ‘మా’ మరింత హీట్ ఎక్కింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లంతా రాజీనామా చేయడం మోహన్ బాబు, మంచు విష్ణు ప్యానల్ వాళ్ళని విమర్శిండం మరింత వివాదానికి దారి తీసింది. కాని మంచు విష్ణు ఇవేమి పట్టించుకోకుండా నిన్న ‘మా’ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేశాడు. తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

Vijay Devarakonda : బట్టలు విప్పేస్తున్న వీడియో షేర్ చేసిన అర్జున్ రెడ్డి

తాజాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘మా’ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా వెళ్లారు. ఎలక్షన్స్ ముందు కూడా బాలకృష్ణతో పాటు కొంతమంది సీనియర్ హీరోలని కలిసి ఓటు వేయమని అభ్యర్థించాడు విష్ణు. ఇప్పుడు ‘మా’ అధ్యక్ష పీఠం ఎక్కిన తరువాత కూడా అందర్నీ కలిసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అరగంట నుంచి బాలకృష్ణ, మోహన్ బాబు, విష్ణు మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ‘మా’ సంక్షేమం కోసమే బాలకృష్ణతో భేటీ అయినట్టు సమాచారం. ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజే పనిలో దూసుకుపోతున్నాడని అనిపిస్తుంది. బాలకృష్ణ తర్వాత మిగిలిన పెద్ద హీరోలని కూడా కలిసి ఆశీస్సులు తీసుకుంటాడని, మా సంక్షేమం కోసం చర్చిస్తాడని తెలుస్తుంది. ఇక ‘మా’ ఎలక్షన్స్ లో గెలిచిన మిగిలిన సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఈ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.