Vishnu Vishal aranya : తెలుగింటి అల్లుడు కాబోతున్నా..పెళ్లి చేసుకోబోతున్నాం

భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ లు ఒక్కటి కాబోతున్నారు.

Vishnu Vishal aranya : తెలుగింటి అల్లుడు కాబోతున్నా..పెళ్లి చేసుకోబోతున్నాం

Vishnu Vishal

Vishnu Vishal and Jwala Gutta : భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ లు ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణంపై రకరకాల కథనాలు వచ్చాయి. ఇక వీటన్నింటికీ చెక్ పెట్టాడు విష్ణు విశాల్. పెళ్లి విషయంపై స్వయంగా ఓ ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే టాలీవుడ్ హీరో, భళ్లాలదేవుడు రానా న్యూ ఫిల్మ్ ‘అరణ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ‘విష్ణు విశాల్’ హాజరయ్యారు. అరణ్య షూటింగ్ సమయంలో గుత్తా జ్వాల చాలా హెల్ప్ చేసిందని, షూటింగ్ స్పాట్ లో తనతోనే ఉందని వెల్లడించాడు. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తెలుగింటి అల్లుడుని కాబోతున్నట్లు విష్ణు విశాల్ చెప్పారు.

రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ ఫిల్మ్ 2021, మార్చి 26వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇందులో విష్ణు విశాల్ మావటి పాత్రలో నటించారని సమాచారం. ఇతనితో పాటు జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్‌ కీలక పాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ నిర్మించింది.

ఇక..గుత్తా జ్వాలా..విష్ణు విశాల్ విషయానికి వస్తే…సెప్టెంబర్ 07వ తేదీన ఒక్కటయ్యారు. ఉంగరాలు మార్చుకున్న ఫొటోలను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హ్యాపీ బర్త్ డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు.

విష్ణు విశాల్ వివాహం రజినితో జరిగింది. వీరికి ఆర్యన్ కొడుకు ఉన్నాడు. కానీ..కొన్ని కారణాల వల్ల…2018లో విడాకులు తీసుకున్నారు. ఇక జ్వాల విషయంలో ఇదే జరిగింది. చేతన్ ఆనంద్ తో వివాహం జరిగినా..కొన్ని కారణాల వల్ల 2011లో విడాకులు తీసుకున్నారు.