Dhamki: ‘ధమ్కీ’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసిన దాస్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది.

Dhamki: ‘ధమ్కీ’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసిన దాస్

Vishwak Sen Dhamki First Single Song Date Locked

Dhamki: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది.

Dhamki Release Date: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశాడు!

దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలక్‌నుమా దాస్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత మరోసారి విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ‘ధమ్కీ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Dhamki Trailer: ధమ్కీ ట్రైలర్.. క్లాస్ కోసం మాస్.. ఊరమాస్!

దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఊరమాస్ అవతారంలో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేథా పేతురాజ్ ఈ సాంగ్‌లో రెచ్చిపోనున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పాటను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. కాగా పాన్ ఇండియా మూవీగా ధమ్కీని రిలీజ్ చేసేందుకు విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.