Vishwak Sen: ఎట్టకేలకు షూటింగ్ ముగించుకున్న విశ్వక్ సేన్ ‘గామి’

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘గామి’ ఎట్టకేలకు షూటింగ్ పనులు ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Vishwak Sen: ఎట్టకేలకు షూటింగ్ ముగించుకున్న విశ్వక్ సేన్ ‘గామి’

Vishwak Sen Long Delayed Gaami Wraps Shooting

Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు.

GAAMI: ‘గామి’తో మరో ప్రయోగం.. అఘోరాగా విశ్వక్ సేన్!

అయితే, విశ్వక్ సేన్ గతంలో ‘గామి’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. కానీ రోజులు గడుస్తున్నా, ఈ సినిమా పూర్తి కాకపోవడంతో ఈ మూవీ గురించి అందరూ మర్చిపోయారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. గామి మూవీ షూటింగ్‌ను ఎట్టకేలకు ముగించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈమేరకు షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా హీరోయిన్ చాందిని చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త లుక్.. VS11 లాంచ్ గ్యాలరీ!

విద్యాధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీలో విశ్వక్ ఓ అఘోర పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్తీక్ శబరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.