Vishwak Sen: విశ్వక్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటంటే..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను మే 8 నుండి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడ అవుతున్నారు.

Vishwak Sen: విశ్వక్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటంటే..?

Vishwak Sen New Movie Update

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తానే స్వయంగా డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిన తీరు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ గతంలోనే స్టార్ట్ చేసిన గామి మూవీ కూడా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Vishwak Sen : సూపర్ హిట్ కాంబినేషన్‌తో వస్తున్న విశ్వక్.. తనలోని బ్యాడ్‌ని పరిచయం చేస్తాడట!

ఇక ఈ హీరో తాజాగా నటిస్తున్న మూవీని VS11 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసి స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మే 8 నుండి రామోజీ ఫిలిం సిటీలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారట.

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త లుక్.. VS11 లాంచ్ గ్యాలరీ!

అయితే, ఈ సినిమా షూటింగ్‌లో విశ్వక్ మే 15 నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ‘రౌడీ ఫెల్లో’ మూవీ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తుండగా అంజలి, నేహా శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.