Vishwaksen : ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ ఇప్పుడు హిందీ, మలయాళంలో రిలీజ్ చేయాలి. వాటికి కూడా ప్రమోషన్స్ చేస్తాను. హిందీలో ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ చేయను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను......................

Vishwaksen :  విశ్వక్ సేన్(Vishwaksen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki). ఉగాది(Ugadi) పండుగ నాడు ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం సాధించాడు విశ్వక్. ముందు నుంచి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో హిట్ కొట్టింది ఈ సినిమా. ఇక మొదటి రోజే ఏకంగా 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చి విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది.

దాస్ కా ధమ్కీ సినిమా సక్సెస్ తో విశ్వక్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొదటి రోజే గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. మొన్నటిదాకా సినిమా రిలీజ్ కి ప్రమోషన్స్ చేసిన విశ్వక్ ఇప్పుడు సక్సెస్ మీట్స్ పెడుతున్నాడు. తాజాగా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడాడు విశ్వక్.

Nani : ఓ దర్శకుడు నన్ను సెట్ లో అందరిముందు అవమానించాడు..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ ఇప్పుడు హిందీ, మలయాళంలో రిలీజ్ చేయాలి. వాటికి కూడా ప్రమోషన్స్ చేస్తాను. హిందీలో ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ చేయను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. అవి పూర్తి చేయాలి. గామి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ తర్వాత సితార బ్యానర్ లో ఒక సినిమా, రామ్ తాళ్లూరి బ్యానర్ లో ఒక సినిమా ఉన్నాయి. ఆ తర్వాత నా ప్రొడక్షన్ లోనే హీరోగా ఒక సినిమా ఉంది. ఇవన్నీ పూర్తి అయ్యాక మళ్ళీ డైరెక్షన్ చేయొచ్చు. ఫలక్ నామా దాస్ 2, దాస్ కా ధమ్కీ 2 రెండు సినిమాలు కచ్చితంగా తీస్తాను. అయితే ఈ రెండిట్లో ఏది ముందు వస్తుందో మాత్రం చెప్పలేను అని తెలిపాడు. ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు