VishwakSen : హిట్ కొట్టాడు.. కోటి రూపాయల కారు కొన్నాడు..

'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా భారీగానే చేశాడు. తాజాగా విశ్వక్ ఓ ఖరీదైన కారుని............

VishwakSen : హిట్ కొట్టాడు.. కోటి రూపాయల కారు కొన్నాడు..

Vishewak

 

VishwakSen :  మాస్‌ కా దాస్‌ అని పిలిపించుకునే విశ్వక్‌ సేన్ క్లాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరవ్వాలని ఇటీవల ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో ప్రేక్షజకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. విశ్వక్ చేసిన ప్రమోషన్స్, ఓ ఛానల్ యాంకర్ తో విశ్వక్ గొడవ, ఆ ఛానల్ లో సినిమాపై, విశ్వక్ పై నెగిటివ్ గా వరుస ప్రోగ్రామ్స్, సోషల్ మీడియాలో విశ్వక్ కి సపోర్ట్ గా ప్రచారం.. వీటన్నితో సినిమాకి మరింత హైప్ వచ్చి భారీ విజయం సాధించింది. క్లాస్ సినిమాతో కూడా హిట్ కొట్టేసాడు యువ మాస్ హీరో.

హిట్ కొట్టిన విశ్వక్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా భారీగానే చేశాడు. తాజాగా విశ్వక్ ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేశాడు. తాను కొన్న కార్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది బెంజ్‌ జీక్లాస్‌ 2022 మోడల్‌ అని తెలుస్తుంది. కార్ తో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. ఇదంతా మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న విషయాలకి సంతోషంగా ఉన్నా. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్.

Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవంలో పూజాహెగ్డే పరువాలు

ఈ కారు ధర దాదాపు రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విశ్వక్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ కింద కామెంట్స్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చాను’ అని సరదాగా కామెంట్‌ చేశారు. వీరిద్దరూ గతంలో ఈ నగరానికి ఏమైంది సినిమా కోసం కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా భారీ విజయం సాధించింది.